Banner


    నిగమనిగమాంతవర్ణితమనోహరరూప
    సంపుటి: 1, సంఖ్య: 243, పుట: 163 (229)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: నిగమనిగమాంతవర్ణితమనోహరరూప
    నగరాజధరుఁడ శ్రీనారాయణా

    చ: దీపించువైరాగ్యదివ్యసౌఖ్యం బియ్య-
    నోపకకదా నన్ను నొడఁబరపుచు
    పైపైనె సంసారబంధములఁ గట్టేవు
    నాపలుకు చెల్లునా నారాయణా

    చ: చీకాకుపడిననాచిత్తశాంతము సేయ-
    లేకకా నీవు బహులీల నన్ను
    కాకుసేసెదవు బహుకర్మములఁ బడువారు
    నాకొలఁదివారలా నారాయణా

    చ: వివిధనిర్బంధముల వెడలఁద్రోయక నన్ను
    భవసాగరములఁ దడఁబడఁ జేతురా
    దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ
    నవనీతచోర శ్రీనారాయణా


    nigamanigamAmtavarNitamanOhararUpa
    sampuTi: 1, samkhya: 243, puTa: 163 (229)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: nigamanigamAmtavarNitamanOhararUpa
    nagarAjadharuDa SrInArAyaNA

    cha: dIpimchuvairAgyadivyasaukhyam biyya-
    nOpakakadA nannu noDabarapuchu
    paipaine samsArabamdhamula gaTTEvu
    nApaluku chellunA nArAyaNA

    cha: chIkAkupaDinanAchittaSAmtamu sEya-
    lEkakA nIvu bahulIla nannu
    kAkusEsedavu bahukarmamula baDuvAru
    nAkoladivAralA nArAyaNA

    cha: vividhanirbamdhamula veDaladrOyaka nannu
    bhavasAgaramula daDabaDa jEturA
    divijEmdravamdya SrItiruvEmkaTAdrISa
    navanItachOra SrInArAyaNA



    Artist(s): Priya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported