Banner


    ఆఱడిఁబెట్టఁగనేల అతని నింతేసి
    సంపుటి: 19, సంఖ్య: 208, పుట: 139 (159)
    సంపుటిలో రాగం: రామక్రియ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆఱడిఁబెట్టఁగనేల అతని నింతేసి నీవు
    మీఱక బంగారుపీఁటమీఁదఁ గూచుండవే

    చ: కొంగువట్టి తియ్యనేలే కొసర నేమిటికే
    సంగతెఱిఁగిననెరజాణవిభుని
    ముంగిట నున్నాఁ డతఁడు మొక్కితే నెఱుకగాదా
    రంగుగాఁ దానే వచ్చీ రావే లోపలికి

    చ: విన్నపము సేయనేలే వేఁడుకొన నింత యేలే
    సన్నదెలిసినయట్టిసరసునికి
    కన్నాఁడు నీగుట్టు వేళగాచుటే తగులుగాదా
    పన్ని నిన్ను నేలీఁగాని పఱవవే పానుపు

    చ: చనవునఁ దిట్టనేలే చవులు చూపఁగనేలే
    యెనసినశ్రీవేంకటేశునెదుట
    ననిచి వున్నాఁ డితఁడు నగుటే వుంకువగాదా
    తనివి నొందించి యింకాఁ దడవవే కాఁగిట


    A~raDibeTTaganEla atani nimtEsi
    sampuTi: 19, samkhya: 208, puTa: 139 (159)
    sampuTilO rAgam: rAmakriya
    rachana: tALlapAka annamAchArya


    pa: A~raDibeTTaganEla atani nimtEsi nIvu
    mI~raka bamgArupITamIda gUchumDavE

    cha: komguvaTTi tiyyanElE kosara nEmiTikE
    samgate~riginanerajANavibhuni
    mumgiTa nunnA DataDu mokkitE ne~rukagAdA
    ramgugA dAnE vacchI rAvE lOpaliki

    cha: vinnapamu sEyanElE vEDukona nimta yElE
    sannadelisinayaTTisarasuniki
    kannADu nIguTTu vELagAchuTE tagulugAdA
    panni ninnu nElIgAni pa~ravavE pAnupu

    cha: chanavuna diTTanElE chavulu chUpaganElE
    yenasinaSrIvEmkaTESuneduTa
    nanichi vunnA DitaDu naguTE vumkuvagAdA
    tanivi nomdimchi yimkA daDavavE kAgiTa



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported