Banner


    అప్పులేనిసంసార మైనపాటే చాలు
    సంపుటి: 1, సంఖ్య: 114, పుట: 78 (144)
    సంపుటిలో రాగం: గుజ్జరి / దేసాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అప్పులేనిసంసార మైనపాటే చాలు
    తప్పులేనిజీత మొక్కతారమైనఁ జాలు

    చ: కంతలేనిగుడిశొక్కగంపంతయినఁ జాలు
    చింతలేనుయంబ లొక్కచేరెఁడే చాలు
    జంతగానితరుణి యేజాతైన నదె చాలు
    వింతలేనిసంప దొక్కవీసమే చాలు

    చ: తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
    ముట్టులేనికూ డొక్కముద్దెఁడే చాలు
    గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైనఁ జాలు
    వట్టిజాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు

    చ: లంపటపడనిమేలు లవలేశమే చాలు
    రొంపికంబమౌకంటె రోయుటే చాలు
    రంపపుఁగోరికకంటె రతి వేంకటపతి-
    పంపున నాతనిఁజేరేభవమే చాలు


    appulEnisamsAra mainapATE chAlu
    sampuTi: 1, samkhya: 114, puTa: 78 (144)
    sampuTilO rAgam: gujjari / dEsALam
    rachana: tALlapAka annamAchArya


    pa: appulEnisamsAra mainapATE chAlu
    tappulEnijIta mokkatAramaina jAlu

    cha: kamtalEniguDiSokkagampamtayina jAlu
    chimtalEnuyamba lokkachEreDE chAlu
    jamtagAnitaruNi yEjAtaina nade chAlu
    vimtalEnisampa dokkavIsamE chAlu

    cha: tiTTulEnibradu kokkadinamaina nade chAlu
    muTTulEnikU DokkamuddeDE chAlu
    guTTucheDi manukamTE komchapumElaina jAlu
    vaTTijAli baDukamTE vacchinamtE chAlu

    cha: lampaTapaDanimElu lavalESamE chAlu
    rompikambamaukamTe rOyuTE chAlu
    rampapugOrikakamTe rati vEMkaTapati-
    pampuna nAtanijErEbhavamE chAlu



    Artist(s): P Unni Krishnan



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported