Banner


    అప్పులవారే అందరును
    సంపుటి: 1, సంఖ్య: 81, పుట: 56 (122)
    సంపుటిలో రాగం: దేసాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అప్పులవారే అందరును
    కప్పఁగఁ దిప్పఁగఁ గర్తలు వేరీ

    చ: ఎక్కడ చూచిన నీప్రపంచమునఁ
    జిక్కులు సిలుగులుఁ జింతలునే
    దిక్కెవ్వరు యీతీదీపులలోఁ
    దిక్కుముక్కులకు దేవుఁడెకాక

    చ: యేది దలంచిన నేకాలంబును
    సూదులమూఁటలసుఖము లివి
    కాదన నౌననఁ గడ గనిపించఁగ
    పోదికాఁడు తలఁపునఁ గలఁ డొకఁడే

    చ: యెన్నఁడు వీడీ నెప్పుడు వాసీఁ
    బన్నినతమతమబంధములు
    వున్నతి సేయఁగ వొప్పులు నెరపఁగ
    వెన్నుఁడు వేంకటవిభుఁడే కలఁడు


    appulavArE amdarunu
    sampuTi: 1, samkhya: 81, puTa: 56 (122)
    sampuTilO rAgam: dEsALam
    rachana: tALlapAka annamAchArya


    pa: appulavArE amdarunu
    kappaga dippaga gartalu vErI

    cha: ekkaDa chUchina nIprapamchamuna
    jikkulu silugulu jimtalunE
    dikkevvaru yItIdIpulalO
    dikkumukkulaku dEvuDekAka

    cha: yEdi dalamchina nEkAlambunu
    sUdulamUTalasukhamu livi
    kAdana naunana gaDa ganipimchaga
    pOdikADu talapuna gala DokaDE

    cha: yennaDu vIDI neppuDu vAsI
    banninatamatamabamdhamulu
    vunnati sEyaga voppulu nerapaga
    vennuDu vEmkaTavibhuDE kalaDu



    Artist(s): G Nageswara Naidu



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported