Banner


    అప్పు డెట్టుండెనో చిత్త మయ్యో
    సంపుటి: 21, సంఖ్య: 499, పుట: 333 (365)
    సంపుటిలో రాగం: భైరవి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అప్పు డెట్టుండెనో చిత్త మయ్యో యెఱఁగనైతి
    చెప్పుడుమాటలకే నేఁ జేరనైతిఁగా

    చ: కొసరికొసరి నీపై కోపమున నుంటిఁగాని
    అసమిచ్చి నీతో మాటలాడనైతిఁగా
    పసలేనిసిగ్గుతోడిపంతాననే వుంటిఁగాని
    ముసిముసినవ్వుమోవి మోపనైతిఁగా

    చ: విరహపుఁగాఁకల నావిసుపే చూపితిఁగాని
    సరిఁ బిల్చితే నూఁకొనఁజాలనైతిఁగా
    వరుసవంతులకై నే వాదులాడితిఁగాని
    మురిపేన మొక్కితే నే మొక్కనైతిఁగా

    చ: వేగమే నీవు గూడితే వెస భ్రమసితిఁగాని
    చేగలనీమేను పచ్చిసేయనైతిఁగా
    భోగపుశ్రీవేంకటేశ పోట్లదొరితిలోన
    నీగతిఁ జెన్నుఁడవైతే నెనసితిఁగా


    appu DeTTumDenO chitta mayyO
    sampuTi: 21, samkhya: 499, puTa: 333 (365)
    sampuTilO rAgam: bhairavi
    rachana: tALlapAka annamAchArya


    pa: appu DeTTumDenO chitta mayyO ye~raganaiti
    cheppuDumATalakE nE jEranaitigA

    cha: kosarikosari nIpai kOpamuna numTigAni
    asamicchi nItO mATalADanaitigA
    pasalEnisiggutODipamtAnanE vumTigAni
    musimusinavvumOvi mOpanaitigA

    cha: virahapugAkala nAvisupE chUpitigAni
    sari bilchitE nUkonajAlanaitigA
    varusavamtulakai nE vAdulADitigAni
    muripEna mokkitE nE mokkanaitigA

    cha: vEgamE nIvu gUDitE vesa bhramasitigAni
    chEgalanImEnu pacchisEyanaitigA
    bhOgapuSrIvEmkaTESa pOTladoritilOna
    nIgati jennuDavaitE nenasitigA



    Artist(s): Saralarao



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported