Banner


    అప్పనివరప్రసాది అన్నమయ్యా
    సంపుటి: 10, సంఖ్య: 23, పుట: 13 (57)
    సంపుటిలో రాగం: సాళంగనాఁట
    రచన: తాళ్లపాక చిన్న తిరుమలాచార్య


    ప: అప్పనివరప్రసాది అన్నమయ్యా
    అప్పసము మాకె కలఁ డన్నమయ్యా

    చ: అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన
    యంతరంగాన నిలిపీ నన్నమయ్యా
    సంతసానఁ జెలువొందె సనకసనందనాదు
    లంతటివాఁడు తాళ్ళపా కన్నమయ్యా

    చ: బిరుదుటెక్కెములుగా బెక్కు సంకీర్తనములు
    హరిమీఁద విన్నవించె నన్నమయ్యా
    విరివిగలిగినట్టి వేదముల యర్థ మెల్లా
    అరసి తెలిపినాఁడు అన్నమయ్యా

    చ: అందమైన రామానుజాచార్యమతమున
    అందుకొని నిలిచినాఁ డన్నమయ్యా
    విందువలె మాకును శ్రీవేంకటనాథుని నిచ్చె
    అందరిలోఁ దాళ్ళపాక అన్నమయ్యా


    appanivaraprasAdi annamayyA
    sampuTi: 10, samkhya: 23, puTa: 13 (57)
    sampuTilO rAgam: sALaMganATa
    rachana: tALlapAka chinna tirumalAchArya


    pa: appanivaraprasAdi annamayyA
    appasamu mAke kala DannamayyA

    cha: aMtaTiki nElikaina AdinArAyaNu dana
    yaMtaraMgAna nilipI nannamayyA
    saMtasAna jeluvoMde sanakasanaMdanAdu
    laMtaTivADu tALLapA kannamayyA

    cha: biruduTekkemulugA bekku saMkIrtanamulu
    harimIda vinnaviMce nannamayyA
    virivigaliginaTTi vEdamula yartha mellA
    arasi telipinADu annamayyA

    cha: aMdamaina rAmAnujAcAryamatamuna
    aMdukoni nilicinA DannamayyA
    viMduvale mAkunu SrIvEMkaTanAthuni nicce
    aMdarilO dALLapAka annamayyA



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported