Banner


    అప్ప డుండే కొండలోన ఇప్పపూల
    సంపుటి: 27, సంఖ్య: ??, పుట: xviii (18)
    సంపుటిలో రాగం: యదుకులకాంబోది
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అప్ప డుండే కొండలోన ఇప్పపూల ఏరబోతే
    ఇప్పపూలు కప్పలాయెరా ఓ వేంకటేశ
    అప్పులుగల వాని వలనే ఓ వేంకటేశ

    చ: ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే
    మూక మూడు విధము లాయరా - ఓ వేంకటేశ
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశ

    చ: అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే
    వొల్వలెల్ల మల్ల్యెలాయే - ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

    చ: అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే
    కంచిలోన కాయ కాచేరా ఓ వేంకటేశా
    శ్రీరంగాన పండు పండేరా ఓ వేంకటేశా

    చ: పుట్టమీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే
    పర్వతాన పండు పండేరా ఓ వేంకటేశా
    అందవచ్చు కోయరాదురా - ఓ వేంకటేశా

    చ: చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే
    కాళ్లులేని వాడు నడిచే ఓ వేంకటేశా
    పెదవిలేనివాఁడు చిలుక తినేరా ఓ వేంకటేశా

    చ: గుంట యెండి పండు పండే - పండుకోశి కుప్పవేశే
    కుప్పకాలి యప్పు తీరేరా - ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

    చ: సందెకాడ తలవ్రాలు సంధిదీరి వేంకటరాయా!
    తెల్లవారనాయనీడరా ఓ వేంకటేశ!
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా!

    చ: ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేశి రాగ
    ముక్కంటిదేవుని జూచేరు ఓ వేంకటేశా!
    దీని భావము నీకే తెలుసురా! ఓ వేంకటేశా!

    చ: ఏటిలోన వలవేశే తాటిమాను నీడలాయె
    దూరపోతే చోటులేదురా ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

    చ: ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె
    పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

    చ: ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని
    మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

    చ: పున్నమ వెన్నెలలోన వన్న్యలాడితోను గూడి
    కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా

    చ: అర్ధరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని
    నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
    దీని భావము నీకే తెలుసురా - ఓ వేంకటేశా


    appa DumDE komDalOna ippapUla
    sampuTi: 27, samkhya: ??, puTa: xviii (18)
    sampuTilO rAgam: yadukulakAmbOdi
    rachana: tALlapAka annamAchArya


    pa: appa DumDE komDalOna ippapUla ErabOtE
    ippapUlu kappalAyerA O vEmkaTESa
    appulugala vAni valanE O vEmkaTESa

    cha: AkASAna poyyEkAki mUkajUchi kEkavESE
    mUka mUDu vidhamu lAyarA - O vEmkaTESa
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESa

    cha: ahObilayya gumTalOna volvalu uduka pOtE
    volvalella mallyelAyE - O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA

    cha: ahObilAna cheTTu buTTE bhUmi yella tIgapArE
    kamchilOna kAya kAchErA O vEmkaTESA
    SrIramgAna pamDu pamDErA O vEmkaTESA

    cha: puTTamIda cheTTu buTTE bhUmiyella tIgapArE
    parvatAna pamDu pamDErA O vEmkaTESA
    amdavachchu kOyarAdurA - O vEmkaTESA

    cha: chEyilEnivADukOSE nettilEni vADumESE
    kALlulEni vADu naDichE O vEmkaTESA
    pedavilEnivADu chiluka tinErA O vEmkaTESA

    cha: gumTa yemDi pamDu pamDE - pamDukOSi kuppavESE
    kuppakAli yappu tIrErA - O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA

    cha: samdekADa talavrAlu samdhidIri vEmkaTarAyA!
    tellavAranAyanIDarA O vEmkaTESa!
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA!

    cha: mutyAla pamdiTilOna mugguru vEmchESi rAga
    mukkamTidEvuni jUchEru O vEmkaTESA!
    dIni bhAvamu nIkE telusurA! O vEmkaTESA!

    cha: ETilOna valavESE tATimAnu nIDalAye
    dUrapOtE chOTulEdurA O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA

    cha: mumdu kUtu rAlu Ame mumdu Alu kUturAye
    pomdugA pemDlAmu tAnAye O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA

    cha: AkulEni aDavilOna mUDutOkala peddapulini
    mEka yokaTi yetti mimgErA O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA

    cha: punnama vennelalOna vannyalADitOnu gUDi
    kinnera mITuchu poyyEvu O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA O vEmkaTESA

    cha: ardharAtrivELalOni rudravINa nettukoni
    nidrimchina ninnu pADaga - O vEmkaTESA
    dIni bhAvamu nIkE telusurA - O vEmkaTESA



    Artist(s): G Nageswara Naidu



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported