Banner


    అప్పఁడు మజ్జనమాడీనంగనఁ
    సంపుటి: 5, సంఖ్య: 256, పుట: 175 (249)
    సంపుటిలో రాగం: శంకరాభరణం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అప్పఁడు మజ్జనమాడీనంగనఁ గూడి
    కుప్పలుఁ దెప్పలుగాఁ గుమ్మరించరో

    చ: బంగారుకొప్పెరల పన్నీరు నించి
    రంగైన పచ్చకప్పురపు ధూళొత్తి
    చెంగటఁ గస్తూరిధూళి చికిలి గావించి
    పొంగారుఁదట్టుపుణుఁగు పోయరో గిన్నెలను

    చ: పటికంపుఁ గాఁగుల పరిమళాలెల్లా
    ఘటియించి కుంకుమతోఁ గడు మేదించి
    అటునిటు గొజ్జంగనీరందంద నించి
    కుటిలకుంతలులు పైఁగుమ్మరించరో

    చ: బలుపింగాణులఁ గదంబము గంధమును
    కలపము గావించి గంబూరముతో
    వెలయ మజ్జనమాడీ వేంకటాద్రివిభుఁడు
    చెలఁగి యింతులు చేరి సేస చల్లరో


    appaDu majjanamADInamgana
    sampuTi: 5, samkhya: 256, puTa: 175 (249)
    sampuTilO rAgam: SamkarAbharaNam
    rachana: tALlapAka annamAchArya


    pa: appaDu majjanamADInamgana gUDi
    kuppalu deppalugA gummarimcharO

    cha: bamgArukopperala pannIru nimchi
    ramgaina pacchakappurapu dhULotti
    chemgaTa gastUridhULi chikili gAvimchi
    pomgArudaTTupuNugu pOyarO ginnelanu

    cha: paTikampu gAgula parimaLAlellA
    ghaTiyimchi kumkumatO gaDu mEdimchi
    aTuniTu gojjamganIramdamda nimchi
    kuTilakumtalulu paigummarimcharO

    cha: balupimgANula gadambamu gamdhamunu
    kalapamu gAvimchi gambUramutO
    velaya majjanamADI vEmkaTAdrivibhuDu
    chelagi yimtulu chEri sEsa challarO



    Artist(s): Vani Jayaram



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported