Banner


    అపరాధిని నే నై నాను
    సంపుటి: 2, సంఖ్య: 326, పుట: 218 (290)
    సంపుటిలో రాగం: భూపాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అపరాధిని నే నై నాను
    కృపగలవారికిఁ గపటము లేదు

    చ: సనాతనా అచ్యుతా సర్వేశ్వరా
    అనాదికారణ అనంతా
    జనార్ధనా అచల సకలలోకేశ్వరా
    నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా

    చ: పురాణపురుషా పురుషోత్తమా
    చరాచరాత్మక జగదీశా
    పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా
    యిరవు నీవేయట యెఱిఁగించఁగదే

    చ: దేవోత్తమా శశిదినకరనయనా
    పావనచరితా పరమాత్మా
    శ్రీవేంకటేశా జీవాంతరంగా
    సేవకుఁడను బుద్ధిచెప్పఁగవలయు


    aparAdhini nE nai nAnu
    sampuTi: 2, samkhya: 326, puTa: 218 (290)
    sampuTilO rAgam: bhUpALam
    rachana: tALlapAka annamAchArya


    pa: aparAdhini nE nai nAnu
    kRpagalavAriki gapaTamu lEdu

    cha: sanAtanA achyutA sarvESwarA
    anAdikAraNa anamtA
    janArdhanA achala sakalalOkESwarA
    ninu marachiyunnADa nanu delupavayA

    cha: purANapuruShA puruShOttamA
    charAcharAtmaka jagadISA
    parAtparA hari brahmAmDanAyakA
    yiravu nIvEyaTa ye~rigimchagadE

    cha: dEvOttamA SaSidinakaranayanA
    pAvanacharitA paramAtmA
    SrIvEmkaTESA jIvAmtaramgA
    sEvakuDanu buddhicheppagavalayu



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported