Banner


    విశ్వప్రకాశునకు వెలియేడ
    సంపుటి: 1, సంఖ్య: 355, పుట: 237 (303)
    సంపుటిలో రాగం: కన్నడగౌళ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప : విశ్వప్రకాశునకు వెలియేడ లో నేడ
    శాశ్వతున కూహింప జన్మ మిఁక నేడ

    చ : సర్వపరిపూర్ణునకు సంచార మిఁక నేడ
    నిర్వాణమూర్తికిని నిలయ మిఁక నేడ
    వుర్వీధరునకుఁ గాలూఁద నొకచోటేడ
    పార్వతీస్తుత్యునకు భావ మిఁక నేడ

    చ : నానాప్రభావునకు నడుమేడ మొదలేడ
    ఆననసహస్రునకు నవ్వలివ లేడ
    మౌనిహృదయస్థునకు మాటేడ పలుకేడ
    జ్ఞానస్వరూపునకుఁ గాన విన నేడ

    చ : పరమయోగీంద్రునకు పరులేడ తానేడ
    దురితదూరునకు సంస్తుతినింద లేడ
    తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ
    హరికి నారాయణున కవుఁగాము లేడ


    viSwaprakASunaku veliyEDa
    sampuTi: 1, samkhya: 355, puTa: 237 (303)
    sampuTilO rAgam: kannaDagauLa
    rachana: tALlapAka annamAchArya


    pa : viSwaprakASunaku veliyEDa lO nEDa
    SASwatuna kUhimpa janma mika nEDa

    cha : sarwaparipUrNunaku samchAra mika nEDa
    nirwANamUrtikini nilaya mika nEDa
    vurvIdharunaku gAlUda nokachOTEDa
    pArvatIstutyunaku bhAva mika nEDa

    cha : nAnAprabhAvunaku naDumEDa modalEDa
    Ananasahasrunaku navvaliva lEDa
    maunihRdayasthunaku mATEDa palukEDa
    j~nAnaswarUpunaku gAna vina nEDa

    cha : paramayOgImdrunaku parulEDa tAnEDa
    duritadUrunaku samstutinimda lEDa
    tiruvEMkaTESunaku divyavigrahamEDa
    hariki nArAyaNuna kavugAmu lEDa



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported