Banner


    ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు
    సంపుటి: 1, సంఖ్య: 438, పుట: 293 (359)
    సంపుటిలో రాగం: సామంతం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆపద్బంధుఁడు హరి మాకుఁ గలఁడు
    దూపిలి తలఁచినా దోషహరము

    చ: గరుడనినెక్కినఘనరేవంతుఁడు
    గరుడకేతనముగలరథుఁడు
    గరుడఁడే తనకును గరియగుబాణము
    గరిమె నీతఁడేపో ఘనగారుడము

    చ: పాముపరపుపైఁ బండినసిద్ధుఁడు
    పాముపాశములపరిహరము
    పామున నమృతముఁపడఁదచ్చినతఁడు
    వేమరు నీతఁడే విషహరము

    చ: కమలాక్షుఁ డీతఁడు కమలనాభుఁడును
    కమలాదేవికిఁ గైవశము
    అమరిన శ్రీవేంకటాధిపుఁ డితఁడే
    మమతల మా కిదే మంత్రౌషధము


    ApadbamdhuDu hari mAku galaDu
    sampuTi: 1, samkhya: 438, puTa: 293 (359)
    sampuTilO rAgam: sAmamtam
    rachana: tALlapAka annamAchArya


    pa: ApadbamdhuDu hari mAku galaDu
    dUpili talachinA dOShaharamu

    cha: garuDaninekkinaghanarEvamtuDu
    garuDakEtanamugalarathuDu
    garuDaDE tanakunu gariyagubANamu
    garime nItaDEpO ghanagAruDamu

    cha: pAmuparapupai bamDinasiddhuDu
    pAmupASamulapariharamu
    pAmuna namRtamupaDadacchinataDu
    vEmaru nItaDE viShaharamu

    cha: kamalAkShu DItaDu kamalanAbhuDunu
    kamalAdEviki gaivaSamu
    amarina SrIvEmkaTAdhipu DitaDE
    mamatala mA kidE mamtrauShadhamu



    Artist(s): Priya Sisters



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported