Banner


    విన్నపాలు వినవలె వింత వింతలు
    సంపుటి: 6, సంఖ్య: 25, పుట: 18 (34)
    సంపుటిలో రాగం: భూపాళం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: విన్నపాలు వినవలె వింత వింతలు
    పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా

    చ: తెల్లవాఱె జామెక్కె దేవతలు మునులు
    అల్లనల్ల నంతనింత నదిగోవారె
    చల్లని తమ్మిరేకుల సారస్యపుఁ గన్నులు
    మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

    చ: గరుడకిన్నరయక్ష కామినులు గములై
    విరహపు గీతముల వింతతాళాల
    పరిపరివిధములం బాడేరు రాగాల నిన్నదివో
    సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

    చ: పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
    పంకజభవాదులు నీపాదాలు చేరి
    అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
    వేంకటేశుఁడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా


    vinnapAlu vinavale vimta vimtalu
    sampuTi: 6, samkhya: 25, puTa: 18 (34)
    sampuTilO rAgam: bhUpALam
    rachana: tALlapAka annamAchArya


    pa: vinnapAlu vinavale vimta vimtalu
    pannagapu dOmatera paikettavElayyA

    cha: tellavA~re jAmekke dEvatalu munulu
    allanalla namtanimta nadigOvAre
    challani tammirEkula sArasyapu gannulu
    mellamellane vichchi mElukonavElayyA

    cha: garuDakinnarayakSha kAminulu gamulai
    virahapu gItamula vimtatALAla
    pariparividhamulam bADEru rAgAla ninnadivO
    sirimogamu derachi chittagimchavElayyA

    cha: pomkapu SEShAdulu tumburu nAradAdulu
    pamkajabhavAdulu nIpAdAlu chEri
    amkelanunnAru lEchi alamElumamganu
    vEmkaTESuDA reppalu vichchi chUchilEvayyA



    Artist(s): M Bala Murali Krishna



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported