Banner


    అణురేణుపరిపూర్ణుఁడైన శ్రీవల్లభునిఁ
    సంపుటి: 1, సంఖ్య: 365, పుట: 244 (310)
    సంపుటిలో రాగం: శ్రీరాగం
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అణురేణుపరిపూర్ణుఁడైన శ్రీవల్లభునిఁ
    బ్రణుతించువారువో బ్రాహ్మలు

    చ: హరినామములనె సంధ్యాదివిధు లొనరించు-
    పరిపూర్ణమతులువో బ్రాహ్మలు
    హరిమంత్రవేదపారాయణులు హరిభక్తి-
    పరులైనవారువో బ్రాహ్మలు

    చ: యేవి చూచినను హరి యిన్నిటాఁ గలఁడనుచు-
    భావించువారువో బ్రాహ్మలు
    దేవకీనందనుఁడె దేవుఁడని మతిఁదెలియు-
    పావనులు వారువో బ్రాహ్మలు

    చ: ఆదినారాయణుని ననయంబుఁ దమయాత్మఁ
    బాదుకొలిపినవారు బ్రాహ్మలు
    వేదరక్షకుఁడైన వేంకటగిరీశ్వరుని-
    పాదసేవకులువో బ్రాహ్మలు


    aNurENuparipUrNuDaina SrIvallabhuni
    sampuTi: 1, samkhya: 365, puTa: 244 (310)
    sampuTilO rAgam: SrIrAgam
    rachana: tALlapAka annamAchArya


    pa: aNurENuparipUrNuDaina SrIvallabhuni
    braNutimchuvAruvO brAhmalu

    cha: harinAmamulane samdhyAdividhu lonarimchu-
    paripUrNamatuluvO brAhmalu
    harimamtravEdapArAyaNulu haribhakti-
    parulainavAruvO brAhmalu

    cha: yEvi chUchinanu hari yinniTA galaDanuchu-
    bhAvimchuvAruvO brAhmalu
    dEvakInamdanuDe dEvuDani matideliyu-
    pAvanulu vAruvO brAhmalu

    cha: AdinArAyaNuni nanayambu damayAtma
    bAdukolipinavAru brAhmalu
    vEdarakShakuDaina vEmkaTagirISwaruni-
    pAdasEvakuluvO brAhmalu



    Artist(s): B Govind



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported