Banner


  అదె చూడు తిరువేంకటాద్రి
  సంపుటి: 1, సంఖ్య: 227, పుట: 151 (217)
  సంపుటిలో రాగం: మలహరి
  రచన: తాళ్లపాక అన్నమాచార్య


  ప: అదె చూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము-
  లందు వెలుగొందీ ప్రభ మీరఁగాను

  చ: తగ నూటయిరువై యెనిమిదితిరుపతులఁ గల-
  స్థానికులును చక్రవర్తిపీఠకములును
  అగణితంబైన దేశాంత్రులమఠంబులును
  నధికమై చెలువొందఁగాను
  మిగులనున్నతములగుమేడలును మాడుగులు
  మితిలేనిదివ్యతపసులున్న గృహములును
  వొగి నొరగుఁబెరుమాళ్ళవునికిపట్టయి వెలయు-
  దిగువతిరుపతి గడవఁగాను

  చ: పొదలి యరయోజనముపొడవుననుఁ బొలుపొంది
  పదినొండుయోజనంబులపరపుననుఁ బరగి
  చెదర కేవంకచూచిన మహాభూజములు
  సింహశార్దూలములును
  కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
  గరుడగంధర్వయక్షులును విద్యాధరులు
  విదితమై విహరించువిశ్రాంతదేశముల
  వేడుకలు దైవారఁగాను

  చ: యెక్కువలకెక్కువై యెసఁగి వెలసినపెద్ద-
  యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీఁద
  అక్కజంబైన పల్లవరాయనిమటము
  అలయేట్ల పేడ గడవన్
  చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి
  మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీఁద-
  నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు
  అంతంతఁ గానరాఁగాను

  చ: బుగులుకొనుపరిమళంబుల పూవుఁదోఁటలును
  పొందైన నానావిధంబుల వనంబులును
  నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల-
  నీడలను నిలిచి నిలిచి
  గగనంబుదాఁకి శృంగార రసభరితమై
  కనకమయమైన గోపురములనుఁ జెలువొంది
  జగతీధరుని దివ్యసంపదలు గలనగరు
  సరుగననుఁ గానరాఁగాను

  చ: ప్రాకటంబైన పాపవినాశనములోని
  భరితమగుదురితములు పగిలి పారుచునుండ
  ఆకాశగంగతోయములు సోఁకిన భవము-
  లంతంత వీఁడి పారఁగను
  యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
  లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
  యేకమై తిరువేంకటాద్రీశుఁ డా దరిని
  యేప్రొద్దు విహరించఁగాను


  ade chUDu tiruvEmkaTAdri
  sampuTi: 1, samkhya: 227, puTa: 151 (217)
  sampuTilO rAgam: malahari
  rachana: tALlapAka annamAchArya


  pa: ade chUDu tiruvEmkaTAdri nAluguyugamu-
  lamdu velugomdI prabha mIragAnu

  cha: taga nUTayiruvai yenimiditirupatula gala-
  sthAnikulunu chakravartipIThakamulunu
  agaNitambaina dESAmtrulamaThambulunu
  nadhikamai cheluvomdagAnu
  migulanunnatamulagumEDalunu mADugulu
  mitilEnidivyatapasulunna gRhamulunu
  vogi noraguberumALLavunikipaTTayi velayu-
  diguvatirupati gaDavagAnu

  cha: podali yarayOjanamupoDavunanu bolupomdi
  padinomDuyOjanambulaparapunanu baragi
  chedara kEvamkachUchina mahAbhUjamulu
  siMhaSArdUlamulunu
  kadisi suravarulu kinnarulu kimpuruShulunu
  garuDagamdharvayakShulunu vidyAdharulu
  viditamai viharimchuviSrAmtadESamula
  vEDukalu daivAragAnu

  cha: yekkuvalakekkuvai yesagi velasinapedda-
  yekku DatiSayamugA nekkinamtaTimIda
  akkajambaina pallavarAyanimaTamu
  alayETla pEDa gaDavan
  chakkanEguchu navvachari gaDachi hari dalachi
  mrokkuchunu mOkALLamuDugu gaDachinamIda-
  nakkaDakkaDa vEmkaTAdrISusampadalu
  amtamta gAnarAgAnu

  cha: bugulukonuparimaLambula pUvudOTalunu
  pomdaina nAnAvidhambula vanambulunu
  nigaDi kikkirisi pamDinamahAvRkShamula-
  nIDalanu nilichi nilichi
  gaganambudAki SRmgAra rasabharitamai
  kanakamayamaina gOpuramulanu jeluvomdi
  jagatIdharuni divyasampadalu galanagaru
  sarugananu gAnarAgAnu

  cha: prAkaTambaina pApavinASanamulOni
  bharitamaguduritamulu pagili pAruchunumDa
  AkASagamgatOyamulu sOkina bhavamu-
  lamtamta vIDi pAraganu
  yIkaDanu gOnETa yatulu bASupatul munu-
  lenna naggalamaivunna vaiShNavulalO
  yEkamai tiruvEmkaTAdrISu DA darini
  yEproddu viharimchagAnu  Artist(s): S P Balasubrahmanyam  vaishnava_mudralu

  annamacharya

  శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
  పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
  త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
  శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

  table
  సంకీర్తనల పట్టిక
  (samkeertanala paTTika)


  Samkeertana
  సంకీర్తన (samkeertana)
  iOS App

  App_Store_Badge

  Contact Admin
  Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported