Banner


    అభయదాయకుఁడ వదె నీవే గతి
    సంపుటి: 1, సంఖ్య: 420, పుట: 283 (323)
    సంపుటిలో రాగం: బౌళిరామక్రియ
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: అభయదాయకుఁడ వదె నీవే గతి
    యిభరక్షక నను నిపుడు గావవే

    చ: భయహర దైతేయభఁజన కేశవ
    జయ జయ నృసింహ సర్వేశ్వరా
    నియతము మాకిదె నీపాదములే గతి
    క్రియగా మమ్మేలి కింక లుడుపవే

    చ: బంధవిమోచన పాపవినాశన
    సింధురవరదా శ్రితరక్ష
    కంధరవర్ణుఁడ గతి నీనామమె
    అంధకారముల నణఁచి మనుపవే

    చ: దైవశిఖామణి తతచక్రాయుధ
    శ్రీవేంకటగిరి శ్రీరమణా
    సావధాన నీశరణ్యమే గతి
    వేవేలకు నావిన్నప మిదియే


    abhayadAyakuDa vade nIvE gati
    sampuTi: 1, samkhya: 420, puTa: 283 (323)
    sampuTilO rAgam: bauLirAmakriya
    rachana: tALlapAka annamAchArya


    pa: abhayadAyakuDa vade nIvE gati
    yibharakShaka nanu nipuDu gAvavE

    cha: bhayahara daitEyabhajana kESava
    jaya jaya nRsiMha sarvESwarA
    niyatamu mAkide nIpAdamulE gati
    kriyagA mammEli kimka luDupavE

    cha: bamdhavimOchana pApavinASana
    simdhuravaradA SritarakSha
    kamdharavarNuDa gati nInAmame
    amdhakAramula naNachi manupavE

    cha: daivaSikhAmaNi tatachakrAyudha
    SrIvEmkaTagiri SrIramaNA
    sAvadhAna nISaraNyamE gati
    vEvElaku nAvinnapa midiyE



    Artist(s): G Balakrishna Prasad



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported