Banner

4. చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం

చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం

TTD Book Ref : Samputi 1 | Page 229 (295) | rAgaM : సామంతం  (sAmaMtaM)

Artist : Sri G Balakrishna Prasad

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ప : చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు || జాలెల్ల నడఁగించు సంకీర్తనం

చ : సంతోషకరమైన సంకీర్తనం || సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం || సంతతముఁ దలఁచుఁ డీసంకీర్తనం

చ : సామజముఁ గాంచినది సంకీర్తనం || సామమున కెక్కు డీసంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం || సామాన్యమా విష్ణుసంకీర్తనం

చ : జముబారి విడిపించు సంకీర్తనం || సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళిసౌఖ్యములిచ్చు సంకీర్తనం || శమదమాదులఁ జేయు సంకీర్తనం

చ : జలజాసనునినోరి సంకీర్తనం  || చలిగొండసుతదలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం || చలపట్టి తలఁచుఁ డీసంకీర్తనం

చ : సరవి సంపదలిచ్చు సంకీర్తనం || సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం || సరుగననుఁ దలఁచుఁ డీసంకీర్తనం

cAladA brahmamidi saMkIrtanaM

pa : cAladA brahma midi saMkIrtanaM mIku
jAlella naDa@MgiMcu saMkIrtanaM

ca : saMtOShakaramaina saMkIrtanaM
saMtApa maNa@MgiMcu saMkIrtanaM
jaMtuvula rakShiMcu saMkIrtanaM
saMtatamu@M dala@mcu@M DIsaMkIrtanaM

ca : sAmajamu@M gAMcinadi saMkIrtanam
sAmamuna kekku DIsaMkIrtanaM
sAmIpya miMdariki saMkIrtanaM
sAmAnyamA viShNusaMkIrtanaM

ca : jamubAri viDipiMcu saMkIrtanaM
samabuddhi voDamiMcu saMkIrtanaM
jamaLisauKyamuliccu saMkIrtanaM
SamadamAdula@M jEyu saMkIrtanaM

ca : jalajAsanuninOri saMkIrtanaM
caligoMDasutadala@Mcu saMkIrtanaM
caluva gaDu nAlukaku saMkIrtanaM
calapaTTi tala@Mcu@M DIsaMkIrtanaM

ca : saravi saMpadaliccu saMkIrtanaM
sarilEni didiyapO saMkIrtanaM
sarusa vEMkaTaviBuni saMkIrtanaM
sarugananu@M dala@Mcu@M DIsaMkIrtanaM

chakraMSrIvAri pAdAluSaMKaM

శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

శృతులై శాస్త్రములై పురాణ కథలై
సుజ్ఞానసారంబులై యతిలోకాగమవీధులై
వివిధ మంత్రార్ధంబులై నీతులై కృతులై
వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళ్ళపాక అన్నయ
వచోనూత్నక్రియల్ చెన్నగున్

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

అన్నమాచార్య అంతర్వాణి
(annamAchArya amtarvANi)

Launch Radio
(Opens New Window)

Samkeertana List
(సంకీర్తనల పట్టిక)
index

Watch TTD SVBC
(Opens New Window)

Discussions
Community

" ఓం నమో వేంకటేశాయ {Chanting} "

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

" గోవింద నామాలు "

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

" శ్రీవేంకటేశం శిరసానమామి "

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

  • Recent Posts

  • Samkeertana Categories

  • Blog Archives

Contact Admin
Browser Requirements : Mozilla Firefox 3.6 or higher || Apple Safari 4.0 or higher. Streaming Media Requirements: Adobe Flash Player