Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : భోగీంద్రులను మీరుఁ బోయి రండు
వేగన మీఁదటివిభవాలకు
చ : హరుఁడ పోయిరా అజుఁడ నీవునుబోయి
తిరిగిరా మీఁదటితిరుణాళ్లకు
సురలు మునులును భూసురులుఁ బోయిరండు
అరవిరి నిన్నాళ్లు నలసితిరి
చ : జముఁడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుఁడవై రా సురలఁ గూడి
గుములై దిక్పతులు దిక్కులకుఁ బోయిరండు
ప్రమదాన నిన్నాళ్లు బడలితిరి
చ : నారదసనకసనందనాదులు
భూరివిభవములఁ బోయిరండు
దూరముగాఁ బోకిట్టే తొరలి వేంకటగిరిఁ
జేరి నన్నిట్లనే సేవించుఁడీ
pa : bhOgImdrulanu mIru bOyi ramDu
vEgana mIdaTivibhavAlaku
cha : haruDa pOyirA ajuDa nIvunubOyi
tirigirA mIdaTitiruNALlaku
suralu munulunu bhUsurulu bOyiramDu
araviri ninnALlu nalasitiri
cha : jamuDa pOyirA SaSiyu nIvunu bOyi
sumukhuDavai rA surala gUDi
gumulai dikpatulu dikkulaku bOyiramDu
pramadAna ninnALlu baDalitiri
cha : nAradasanakasanamdanAdulu
bhUrivibhavamula bOyiramDu
dUramugA bOkiTTE torali vEmkaTagiri
jEri nanniTlanE sEvimchuDI