
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : అప్పులేనిసంసార మైనపాటే చాలు
తప్పులేనిజీత మొక్కతారమైనఁ జాలు
చ : కంతలేనిగుడిశొక్కగంపంతయినఁ జాలు
చింతలేనుయంబ లొక్కచేరెఁడే చాలు
జంతగానితరుణి యేజాతైన నదె చాలు
వింతలేనిసంప దొక్కవీసమే చాలు
చ : తిట్టులేనిబ్రదు కొక్కదినమైన నదె చాలు
ముట్టులేనికూ డొక్కముద్దెఁడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచపుమేలైనఁ జాలు
వట్టిజాలిఁ బడుకంటే వచ్చినంతే చాలు
చ : లంపటపడనిమేలు లవలేశమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపుఁగోరికకంటె రతి వేంకటపతి-
పంపున నాతనిఁజేరేభవమే చాలు
pa : appulEnisamsAra mainapATE chAlu
tappulEnijIta mokkatAramaina jAlu
cha : kamtalEniguDiSokkagampamtayina jAlu
chimtalEnuyamba lokkachEreDE chAlu
jamtagAnitaruNi yEjAtaina nade chAlu
vimtalEnisampa dokkavIsamE chAlu
cha : tiTTulEnibradu kokkadinamaina nade chAlu
muTTulEnikU DokkamuddeDE chAlu
guTTucheDi manukamTE komchapumElaina jAlu
vaTTijAli baDukamTE vacchinamtE chAlu
cha : lampaTapaDanimElu lavalESamE chAlu
rompikambamaukamTe rOyuTE chAlu
rampapugOrikakamTe rati vEMkaTapati-
pampuna nAtanijErEbhavamE chAlu