Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా
చ : చందురునుదయవేళ సవ రేతిరి కాడ
కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటివాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా
చ : వసుదేవునియెదుట వైకుంఠనాథుఁడు
శిశువై యవతరించి చెలఁగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాఁ డభయమిచ్చీనమ్మా
చ : కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూఁక లణఁచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాలఁ బరగీనమ్మా
pa : AdiviShNu vItaDE yaTarammA
Adigoni bhUbhAra maNachInOyammA
cha : chamdurunudayavELa sava rEtiri kADa
kamduva dEvaki biDDa ganenammA
pomduga brahmAdulu puruTimTivAkiTanu
chemdi bAluni nutulu sEsErOyammA
cha : vasudEvuniyeduTa vaikumThanAthuDu
SiSuvai yavatarimchi chelagI nammA
musimusinavvulatO munulaku RShulaku
yisumamtavA DabhayamicchInammA
cha : kannatallidamDrulaku karmapASamu lUDichi
anniTA rAkAsimUka laNachInammA
vunnati SrIvEmkaTAdrinumDi lakShmIdEvitODa
panni nichchakalyANAla baragInammA