Showing Samkeertana 3 of 5 found for the category: pedda tirumalAchArya.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : బ్రహ్మ పూజించే రఘుపతి విభీషణు కిచ్చె
బ్రహ్మణ్యుఁడీ రంగపతిఁ గొలువరో
చ : కావేరీ మధ్య రంగక్షేత్ర మల్లదిగో
శ్రీవిమాన మదిగో శేషపర్యంక మిదె
దేవుఁ డల్లదె వాఁడే దేవి శ్రీలక్ష్మి యదె
సేవించరో నాభిఁ జిగురించె నతఁడూ
చ : యేడు గోడలు నవిగో యెసఁగు పూఁదోఁపు లవె
కూడి దామోదరపురగోపుర మదె
తోడ వేయిగంబాల దొడ్డమంటప మదిగో
చూడరో పసిఁడిమించులకంబ మదిగో
చ : ఆళువారలు వారే యంగరంగవిభవ మదే
వాలు శ్రీవైష్ణవపు వాడ లవిగో
ఆలీల శ్రీవేంకటేశుఁడై వర మిచ్చీని
తాలిముల శ్రీరంగ దైవముఁ గొలువరో
pa : brahma pUjimchE raghupati vibhIShaNu kicche
brahmaNyu@MDI ramgapati@M goluvarO
cha : kAvErI madhya ramgakShEtra malladigO
SrIvimAna madigO SEShaparyamka mide
dEvu@M Dallade vA@MDE dEvi SrIlakshmi yade
sEvimcharO nAbhi@M jigurimche nata@MDU
cha : yEDu gODalu navigO yesa@Mgu pU@MdO@Mpu lave
kUDi dAmOdarapuragOpura made
tODa vEyigaMbAla doDDamamTapa madigO
chUDarO pasi@MDimimchulakamba madigO
cha : ALuvAralu vArE yamgaramgavibhava madE
vAlu SrIvaiShNavapu vADa lavigO
AlIla SrIvEMkaTESu@MDai vara micchIni
tAlimula SrIramga daivamu@M goluvarO