
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : ఏలే ఏలే మరదలా చాలుఁజాలు చాలును
చాలు నీతోడి సరసంబు బావ
చ : గాఁటపు గుబ్బలు గదలఁగఁ గులికేవు
మాటలఁ దేటల మరఁదలా
చీకటి మాటికిఁ జెనకేవే వట్టి-
బూటకాలు మాని పోవే బావ
చ : అందిందె నన్ను నదలించి వేసేవు
మందమేలపు మరఁదలా
సందుకోఁ దిరిగేవు సటకారి వోబావ
పొందు గాదిఁకఁ బోవే బావ
చ : చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరఁదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగులైతి బావ
pa : ElE ElE maradalA chAlujAlu chAlunu
chAlu nItODi sarasambu bAva
cha : gATapu gubbalu gadalaga gulikEvu
mATala dETala maradalA
chIkaTi mATiki jenakEvE vaTTi-
bUTakAlu mAni pOvE bAva
cha : amdimde nannu nadalimchi vEsEvu
mamdamElapu maradalA
samdukO dirigEvu saTakAri vObAva
pomdu gAdika bOvE bAva
cha : chokkapu giligimta chUpula nannu
makkuva sEsina maradalA
gakkuna nanu vEmkaTapati kUDiti
dakkimchukomTivi tagulaiti bAva