
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : చాలదా బ్రహ్మ మిది సంకీర్తనం మీకు || జాలెల్ల నడఁగించు సంకీర్తనం
చ : సంతోషకరమైన సంకీర్తనం || సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం || సంతతముఁ దలఁచుఁ డీసంకీర్తనం
చ : సామజముఁ గాంచినది సంకీర్తనం || సామమున కెక్కు డీసంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం || సామాన్యమా విష్ణుసంకీర్తనం
చ : జముబారి విడిపించు సంకీర్తనం || సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళిసౌఖ్యములిచ్చు సంకీర్తనం || శమదమాదులఁ జేయు సంకీర్తనం
చ : జలజాసనునినోరి సంకీర్తనం || చలిగొండసుతదలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం || చలపట్టి తలఁచుఁ డీసంకీర్తనం
చ : సరవి సంపదలిచ్చు సంకీర్తనం || సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం || సరుగననుఁ దలఁచుఁ డీసంకీర్తనం
pa : cAladA brahma midi saMkIrtanaM mIku
jAlella naDa@MgiMcu saMkIrtanaM
ca : saMtOShakaramaina saMkIrtanaM
saMtApa maNa@MgiMcu saMkIrtanaM
jaMtuvula rakShiMcu saMkIrtanaM
saMtatamu@M dala@mcu@M DIsaMkIrtanaM
ca : sAmajamu@M gAMcinadi saMkIrtanam
sAmamuna kekku DIsaMkIrtanaM
sAmIpya miMdariki saMkIrtanaM
sAmAnyamA viShNusaMkIrtanaM
ca : jamubAri viDipiMcu saMkIrtanaM
samabuddhi voDamiMcu saMkIrtanaM
jamaLisauKyamuliccu saMkIrtanaM
SamadamAdula@M jEyu saMkIrtanaM
ca : jalajAsanuninOri saMkIrtanaM
caligoMDasutadala@Mcu saMkIrtanaM
caluva gaDu nAlukaku saMkIrtanaM
calapaTTi tala@Mcu@M DIsaMkIrtanaM
ca : saravi saMpadaliccu saMkIrtanaM
sarilEni didiyapO saMkIrtanaM
sarusa vEMkaTaviBuni saMkIrtanaM
sarugananu@M dala@Mcu@M DIsaMkIrtanaM