Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : హరియవతార మీతఁడు అన్నమయ్య
అరయ మాగురుఁడీతఁడన్నమయ్య
చ :వైకుంఠనాధునివద్ద వడిఁబాడుచున్నవాఁడు
ఆకరమై తాళ్లపాక అన్నమయ్య
ఆకశపువిష్ణుపాదమందు నిత్యమై వున్నవాఁడు
ఆకడీకడఁ దాళ్లపాక అన్నమయ్య
చ : క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచునున్నవాఁడు
ఆరితేరి తాళ్లపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండలతేజమువద్ద నున్నవాఁడు
ఆరీతులఁ దాళ్లపాక అన్నమయ్య
చ :యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్లపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశుపాదములందె వున్నవాఁడు
హావభావమై తాళ్లపాక అన్నమయ్య
pa : hariyavatAra mItaDu annamayya
araya mAguruDItaDannamayya
cha : vaikunThanAdhunivadda vaDibADuchunnavADu
Akaramai tALlapAka annamayya
AkaSapuvishNupAdamandu nityamai vunnavADu
AkaDIkaDa dALlapAka annamayya
cha : kshIrAbdhiSAyi niTTE sEvimpuchununnavADu
AritEri tALlapAka annamayya
dhIruDai sUryamanDalatEjamuvadda nunnavADu
ArItula dALlapAka annamayya
cha : yIvala samsAralIla yindirESutO nunnavADu
AvaTinchi tALlapAka annamayya
bhAvimpa SrIvEmkaTESupAdamulande vunnavADu
hAvabhAvamai tALlapAka annamayya