
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప :బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటిపోరా
తడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా
చ :మురియుచు నీ ధరజెప్పినట్లు విన ముచికుందుడగాను
అరుదుమీరలని నెగురువేయ నే హనుమంతుడగాను
సరగున మ్రుచ్చులమాటలు విననే జాంబవంతుడనుగాను
బిరబిర మీవల లోపల బడనే విభీషణుడనుగాను
చ :మాయచేత వంచింపబడగనే మహేశుడనుగాను
న్యాయము లేకయే యిటునటు దిరుగును నారదుండగాను
ఆయముచెడి హరినరుడని కొలువను నర్జునుండగాను
దాయాదుండని మదిలో మురియను దశరథుడనుగాను
చ:గరిమతోడ మా సీతనుజూడ కాచితినిందాక
పరగభద్రుని శిఖరవాసా పరబలసంహార
నరహరి నను రక్షింపవేగమే నారాయణరూపా
మరచి నిదురలోనైనను మీపద సరసిజములు మరువ
pa : biDiyamElanika mOkshamicci nIvaDugudATipOrA
taDavAyenu nEnOrvalEnu doratanamu dAcukOrA
cha :muriyucu nI dharajeppinaTlu vina mucikumduDagAnu
arudumIralani neguruvEya nE hanumamtuDagAnu
saraguna mrucculamATalu vinanE jAmbavamtuDanugAnu
birabira mIvala lOpala baDanE vibhIshaNuDanugAnu
cha:mAyacEta vamcimpabaDaganae mahESuDanugAnu
nyAyamu lEkayE yiTunaTu dirugunu nAradumDagAnu
AyamuceDi harinaruDani koluvanu narjunumDagAnu
dAyAdumDani madilO muriyanu daSarathuDanugAnu
cha:garimatODa mA sItanujUDa kAcitinimdAka
paragabhadruni SikharavAsA parabalasaMhAra
narahari nanu rakshimpavEgamE nArAyaNarUpA
maraci niduralOnainanu mIpada sarasijamulu maruva