Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప :ఇక్ష్వాకుకులతిలక ఇకనైన బలుకవు రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర
చ : చుట్టు ప్రాకారములు సొంపుతోగట్టిస్తి రామచంద్ర
యాప్రాకారములకు బట్టెపదివేలవరహాలు రామచంద్ర
గోపర మంటపాలుకుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగజూడక యిత్తరి బ్రోవుము రామచంద్ర
చ : భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్ర
యాపతకమునకు బట్టె పదివేలవరహాలు రామచంద్ర
శత్రుఘ్నునకుచేయిస్తి బంగారు మొలత్రాడు రామచంద్ర
ఆ మొలత్రాటికిబట్టె మొహరీలు పదివేలు రామచంద్ర
చ:లక్ష్మణునకు చేయిస్తి ముత్యాలపతకము రామచంద్ర
యా పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్ర
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
యా పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్ర
చ : వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్ర
జగన్మోహన సంకెళ్ళువేసిరి కాళ్ళకు రామచంద్ర
కలికితురాయి నీకు మెరవుగ జేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు దిరిగెదవు ఎవరబ్బసొమ్మని రామచంద్ర
చ : మీతండ్రి దశరధమహారాజు పెట్టినా రామచంద్ర
లేక మీ మామ జనకమహారాజు పంపెనా రామచంద్ర
అబ్బతిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్ర
యీ దెబ్బలకోర్వక అబ్బతిట్టితినయ్య రామచంద్ర
చ :ఏటికి జల్లిన నిళ్ళాయె నా బ్రతుకు రామచంద్ర
నేను అధమురాలికంటె నన్యాయమైతిని రామచంద్ర
సర్కారు పైకము తృణముగ నెంచక రామచంద్ర
దెబ్బల దినలేను యప్పుదీర్చుమయ్య రామచంద్ర
చ :కౌసల్యపుత్రుడ దశరధ తనయుడ రామచంద్ర
కావు క్షేమముగ భద్రాద్రినెలకొన్న శ్రీరామచంద్ర
భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్ర
నీవు క్షేమముగ శ్రీరామదాసుని నేలుము రామచంద్ర
pa :ikshvAkukulatilaka ikanaina balukavu rAmacamdra
nannu rakshimpakunnanu rakshakulevarimka rAmacamdra
cha:cuTTu prAkAramulu somputOgaTTisti rAmacamdra
yAprAkAramulaku baTTepadivElavarahaalu rAmacamdra
gOpara mamTapAlukuduruga gaTTisti rAmacamdra
nanu krottagajUDaka yittari brOvumu rAmacamdra
cha:bharatunaku caeyisti paccalapatakamu rAmacamdra
yApatakamunaku baTTe padivElavarahAlu rAmacamdra
SatrughnunakucEyisti bamgAru molatrADu rAmacamdra
A molatrATikibaTTe moharIlu padivElu rAmacamdra
cha:lakshmaNunaku cEyisti mutyAlapatakamu rAmacamdra
yA patakamunakubaTTe padivEla varahAlu rAmacamdra
sItammaku cEyisti cimtAku patakamu rAmacamdra
yA patakamunakubaTTe padivEla varahAlu rAmacamdra
cha:vAhanamulu mIku varusatO jEyisti rAmacamdra
jaganmOhana samkeLLuvEsiri kALLaku rAmacamdra
kalikiturAyi nIku meravuga jEyisti rAmacamdra
nIvu kulukucu dirigedavu evarabbasommani rAmacamdra
cha:mItamDri daSaradhamahArAju peTTinaa rAmacamdra
lEka mI mAma janakamahArAju pampenA rAmacamdra
abbatiTTitinani AyAsapaDavaddu rAmacamdra
yI debbalakOrvaka abbatiTTitinayya rAmacamdra
cha:ETiki jallina niLLAye nA bratuku rAmacamdra
nEnu adhamurAlikamTe nanyAyamaitini rAmacamdra
sarkAru paikamu tRNamuga nemcaka rAmacamdra
debbala dinalEnu yappudIrcumayya rAmacamdra
cha:kausalyaputruDa daSaradha tanayuDa rAmacamdra
kAvu kshEmamuga bhadrAdrinelakonna SrIrAmacamdra
bhaktulamdarini paripAlimceDi SrIrAmacamdra
nIvu kshEmamuga SrIrAmadAsuni nElumu rAmacamdra