
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : ఏ తీరుగ నన్ను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నా తరమా భవసాగరమీదను నళినదలేక్షణ రామా
చ : శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కరుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా
మురిపెముతో నాస్వామి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక ఇకనభమానముంచు నీమరుగుజొచ్చితిని రామా
చ :క్రూరకర్మములునేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవే దైవషిఖామణి రామా
గురుడవు నామది దైవము నీవని గురుశస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగకితిరిగెడు క్రూరుడనైతిని రామా
చ : తాండవమున కఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకా రామా
భండనమున నీనామముదలచిన బ్ర్హ్మానందము రామా
వాసవకమల భావాసురవందిత వారధిబంధన రామా
భాసురవర సద్గుణములుకల్గిన భద్రాద్రీశ్వర రామా
వాసవనుత రామదాసపోషకవందన మయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె దాశరధీరఘురామా
pa : E tIruga nannu dayajUcedavO inavamSOttama rAmA
nA taramA bhavasAgaramIdanu naLinadalEkshaNa rAmA
ca : SrIraghunamdana sItAramaNA SritajanapOshaka rAmA
karuNyAlaya bhaktavarada ninu kannadikAnupu rAmA
muripemutO nAswAmi nIvani mumduga delpiti rAmA
maruvaka ikanabhamAnamumcu nImarugujoccitini rAmA
ca :krUrakarmamulunEraka cEsiti nEramulemcaku rAmA
dAridryamu parihAramucEyavE daivaShikhAmaNi rAmA
guruDavu nAmadi daivamu nIvani guruSastrambulu rAmA
gurudaivambani yerugakitirigeDu krUruDanaitini rAmA
ca : tAmDavamuna kakhilAmDa kOTibrahmAMDa nAyakA rAmA
bhamDanamuna nInAmamudalacina brhmAnamdamu rAmA
vAsavakamala bhAvAsuravamdita vAradhibamdhana rAmA
bhAsuravara sadguNamulukalgina bhadrAdrISvara rAmA
vAsavanuta rAmadAsapOshakavamdana mayOdhya rAmA
dAsArcita mAkabhayamosamgave dASaradhIraghurAmA