
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప :నిన్ను బోనిచ్చెదనా సీతారామా నిన్ను బోనిచ్చెదనా
నిన్ను బోనిచ్చెదనా నన్ను రక్షింప
కెన్నివిధములో నా కన్నులారామా
చ :రట్టుచేసెద నిన్నరికట్టుదునింక
దిక్కుగలిగితె మొఱపెట్టుకోర రామ
గట్టిగ నీపాదకమలము లెప్పుడు
పట్టి నామదిలో గట్టియుందుర రామ
చ :వడి వడి మీవెంటబడి తిరుగ నేనెంతో
జడియక నీవెందు జరిగెదవురా రామ
తడయక నీతల్లిదండ్రు ల్వచ్చిన గాని
విడిచిపెట్టిన నీ కొడుకునురా రామ
చ:మావాడనని మొగమాటము లేకున్న
సేవజేసిన రవ్వ చేయుదురా రామ
నీవు భద్రాచల నిలయుడవైనన్ను
కావవయ్య రామదాస విలాస
pa : ninnu bOniccedanA sItArAmA ninnu bOniccedanA
ninnu bOniccedanA nannu rakshimpa
kennividhamulO nA kannulArAmA
cha :raTTucEseda ninnarikaTTudunimka
dikkugaligite mo~rapeTTukOra rAma
gaTTiga nIpAdakamalamu leppuDu
paTTi nAmadilO gaTTiyumdura rAma
cha:vaDi vaDi mIvemTabaDi tiruga nEnemtO
jaDiyaka nIvemdu jarigedavurA rAma
taDayaka nItallidamDru lvaccina gAni
viDicipeTTina nI koDukunurA rAma
cha:mAvADanani mogamATamu lEkunna
sEvajEsina ravva cEyudurA rAma
nIvu bhadrAcala nilayuDavainannu
kAvavayya rAmadAsa vilAsa